శివాజీనగర: ఇటీవల బెళగావిలో అసెంబ్లీ సమావేశాల సమయంలో విధానపరిషత్‌లో మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను అసభ్యకరంగా దూషించారనే కేసులో బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవికి హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని రవి వేసిన పిటిషన్‌ని న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న విచారించారు.
అసెంబ్లీలో నిర్భయంగా మాట్లాడగలగాలి. మహిళ గౌరవానికి భంగం కలిగించి ఉంటే సభాపతి చర్యలు తీసుకోవచ్చని రవి తరఫు న్యాయవాది తెలిపారు. రవి స్వర నమూనాల పరీక్షకు అవకాశం ఇవ్వాలని సర్కారు న్యాయవాది విన్నవించారు. అసెంబ్లీలో అసభ్యకరమైన పదాన్ని వాడేందుకు మినహాయింపు లేదని వాదించారు. వాద ప్రతివాదనను ఆలకించిన న్యాయమూర్తి ఫిబ్రవరి 20 వరకు రవిపై పోలీసులు చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర స్టేనిచ్చారు. దీనిపై మీ వాదన ఏమిటో వినిపించాలని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు సమన్లు జారీచేశారు.
రేవణ్ణ కేసులో..
దొడ్డబళ్లాపురం: మహిళ కిడ్నాప్ అభియోగంలో జేడీఎస్ మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణపై చార్జ్‌షీట్ నమోదు చేయకుండా హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పొడిగించింది. ఈ కేసునే కొట్టేయాలని రేవణ్ణ పెట్టుకున్న పిటిషన్‌ను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment