శివాజీనగర: బెంగళూరు నగరంలోని హెసరఘట్ట గడ్డి భూములను గ్రేటర్ హెసరఘట్ట గడ్డి భూమి సంరక్షణా రిజర్వు ప్రాంతంగా కేబినెట్‌లో అంగీకరించారు. హెసరఘట్టను సంరక్షిత గడ్డిభూమి ప్రాంతంగా ప్రకటించాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది, పర్యావరణవాదులు హెసరఘట్టను కాపాడాలని కోరుతున్నట్లు అటవీమంత్రి ఈశ్వర్‌ఖండ్రే చెప్పారు. బెంగళూరు కాంక్రీట్ అడవిగా ఉండకుండా, పచ్చదనంతో వెల్లివిరియాలన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హెసరఘట్ట గడ్డి భూమి 356 ఎకరాలు, బైరాపుర చెరువు 383 ఎకరాలు, బైతా చెరువు 165 ఎకరాలు, హెసరగట్టు చెరువు 1356 ఎకరాలు, పశు సంవర్ధక శాఖవారి స్వాధీనంలో ఉన్న 2750 ఎకరాలతో పాటుగా మొత్తం 5010 ఎకరాల ప్రాంతాన్ని రిజర్వు ప్రాంతంగా నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment