బిజీ ట్రాఫిక్‌కు ఏఐ సిగ్నల్ హంగు
బనశంకరి: బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాలు సజావుగా సంచరించేలా 123 ప్రముఖ సిగ్నల్స్ కూడళ్లలో ఏఐ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ అమర్చామని బెంగళూరు ట్రాఫిక్ విభాగంజాయింట్ పోలీస్‌కమిషనర్ ఎంఎన్.అనుచేత్ తెలిపారు. ప్రయోగాత్మకంగా అమలుచేసిన బెంగళూరు అడాప్టిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ (బీఏటీసీఎస్) ను గురువారం హోంమంత్రి పరమేశ్వర్ ప్రారంభించారు.
అనుచేత్ మాట్లాడుతూ 165 జంక్షన్లలోకి 123 చోట్ల నూతన సిగ్నల్స్‌ను అమర్చామని, దీంతో సిగ్నల్ వ్యవస్థ మెరుగ్గా పనిచేసి ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయన్నారు. కెమెరాలతో రద్దీని లెక్కిస్తూ ఏ వైపునకు త్వరగా ట్రాఫిక్‌ను పంపించాలి అని విశ్లేషణ చేస్తుందన్నారు. వాహనదారులు అనవసరంగా సిగ్నల్స్‌లో వేచిచూడటం తప్పుతుందన్నారు. 123 జంక్షన్లలో ఇలాంటి సిగ్నల్స్ ఉన్నాయని, శీఘ్రమే గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. వాహనదారుల ప్రయాణసమయం తగ్గడంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందని చెప్పారు. ఈ సిగ్నల్స్ ఉన్న చోట ఉత్తమ ఫలితాలు వచ్చాయని, వాహనదారులకు 20 శాతం సమయం తగ్గిందని తెలిపారు. మొత్తంమీద 15 శాతానికి పైగా ట్రాఫిక్ రద్దీ తగ్గిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అలోక్‌మోహన్, పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
యమ రాజు సందడి
హెల్మెట్‌ను ధరించండి, అది కూడా ఫుల్ హెల్మెట్, అప్పుడే ప్రయాణం భద్రంగా సాగుతుంది, లేదంటే యమరాజు వస్తాడు అని బైకిస్టులకు ట్రాఫిక్ పోలీసులు హితబోధ చేశారు. బెంగళూరు మార్కెట్ సర్కిల్‌లో ఈ జాగృతి కార్యక్రమం నిర్వహించారు. యమధర్మరాజు వేషధారి, ట్రాఫిక్ పోలీసులు కలిసి హెల్మెట్ లేనివారిని, హాఫ్ హెల్మెట్ వేసుకున్నవారిని నిలిపి మందలించారు.
నగరంలో పలు కూడళ్లలో
బీఏటీసీఎస్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment