కుంభమేళా మృతుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

కుంభమేళా మృతుల తరలింపు

Published Fri, Jan 31 2025 1:04 AM | Last Updated on Fri, Jan 31 2025 1:03 AM

కుంభమేళా మృతుల తరలింపు

కుంభమేళా మృతుల తరలింపు

బనశంకరి: యూపీలో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో తొక్కిసలాటలో చనిపోయిన నలుగురు బెళగావివాసుల్లో ఇద్దరి మృతదేహాలను ఢిల్లీ నుంచి బెళగావికి విమానంలో తరలించారు. మరో ఇద్దరి మృతదేహాలను గోవాకు తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్‌ ద్వారా తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ మహమ్మద్‌రోషన్‌ తెలిపారు. మహాదేవి బావనూర, అరుణ కోర్పడే, జ్యోతి హత్తరవాటి, ఆమె కూతురు మేఘ తొక్కిసలాటలో మరణించారు. స్థానిక నాయకులు మృతుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. మృతదేహాలకు శుక్రవారం అంత్యక్రియలు జరపనున్నారు.

అన్నభాగ్య డబ్బుల

కోసం కళ్లు కాయలు

విజయపుర: బెంగళూరు గ్రామీణ జిల్లాలో అన్నభాగ్య లబ్ధిదారుల ఖాతాల్లో గత నాలుగు నెలలుగా డబ్బు జమా చేయడం లేదని తెలిసింది. బీపీఎల్‌ రేషన్‌ కార్డు కలిగిన వారికి జాతీయ ఆహార భద్రతా చట్ట కింద 5 కేజీల బియ్యంతో పాటు రాష్ట్రప్రభుత్వం నుంచి అదనంగా 5 కేజీల బియ్యం ఇస్తున్నారు. అయితే బియ్యం కొరత కారణంగా ఐదు కేజీల బియ్యానికి బదులు ప్రతి కేజీకి రూ. 34 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి జమా చేస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి ఈ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి పడడం లేదు. పదేపదే బ్యాంకుల వద్దకు వెళ్లి డబ్బులు పడ్డాయా అని అడుగుతున్నారు. లేదు అని చెప్పడంతో ఉసూరుమంటున్నారు.

రౌడీ ప్రవృత్తిని విడనాడాలి

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ తాలూకాలోని ఎలక్ట్రానిక్‌ సిటికి సమీపంలో ఉన్న హెబ్బగోడి పోలీసు స్టేషన్‌ పరిధిలో రౌడీలకు పేరెడ్‌ నిర్వహించారు. ఇన్స్‌పెక్టర్‌ సోమశేఖర్‌ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, వారిని బెదిరించినా మీపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హెబ్బగోడి పరిధిలో అనేక పరిశ్రమలు ఉన్నాయని, వేలాది మంది కార్మికులు పనులకు వెళ్ళి వస్తుంటారని, అలాంటి వారితో గొడవలు పెట్టుకుంటే కఠిన శిక్ష తప్పదని సూచించారు. రౌడీలు నేర ప్రవృత్తిని పక్కనపెట్టి ప్రజలతో కలిసిమెలిసి జీవించాలన్నారు. ఎప్పుడు పిలిచినా కూడా సమాయానికి వచ్చి హాజరు కావాలని, రాకపోతే తదుపరి చర్యలకు సిద్ధం కావాలన్నారు.

కుష్టును తరిమేద్దాం

మైసూరు: జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద కుష్టు వ్యాధి అభియాన్‌–2025 సందర్భంగా పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలను జిల్లాధికారి లక్ష్మీకాంతరెడ్డి విడుదల చేశారు. ఆరోగ్య కార్యకర్తలందరూ ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి గ్రస్తులను కనుగొని చికిత్సకు తరలించాలన్నారు. మూఢనమ్మకాలకు గురికాకుండా వైద్యచికిత్సలతో ఈ జబ్బును పారదోలి స్వాస్థ్య సమాజాన్ని నిర్మించేందుకు కలిసికట్టుగా శ్రమిద్దామన్నారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు స్పర్శ కుష్టువ్యాధి అభియాన్‌ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో కలిసి జాతా నిర్వహించారు. డీహెచ్‌ఓ డాక్టర్‌ కుమారస్వామి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు అనుమానాస్పద కుష్టు వ్యాధి కేసులను గుర్తించాలన్నారు.

కంపెనీకి రూ. 7 కోట్లు టోపీ

ఘరానా ఉద్యోగి అరెస్టు

బనశంకరి: సినిమాలో మాదిరిగా నగరంలో ప్రైవేటు కంపెనీ ఉద్యోగి పనిచేసే కంపెనీలోనే రూ.7 కోట్లు కాజేశాడు. ఆ డబ్బుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో జల్సా చేశాడు. వివరాలు.. నిందితుడు మావళ్లి శ్రీకాంత్‌.. నగరంలోని వివిధ కంపెనీలకు ఆర్థిక సేవలు అందించే సంస్థలో ఉద్యోగి. అలాగే కాడుబీసనహళ్లిలో స్విగ్గి కంపెనీలో 2023 ఆగస్టు నుంచి అసోసియేట్‌ అకౌంటెంట్‌గా ఉన్నాడు. స్విగ్గి కంపెనీ విద్యుత్‌ బిల్లులను చెల్లించే పనులను చూసేవాడు. విద్యుత్‌ బిల్లు కోసం ప్రతినెలా రూ.2 కోట్లు ఇచ్చేది, కానీ ఇతను డబ్బు చెల్లించకుండా బెట్టింగ్‌ ఆడుకుంటూ ఉండేవాడు. మిగతా డబ్బుతో విలాస జీవితం గడిపేవాడు. 6 నెలల్లో రూ.7 కోట్లను మంచినీళ్లలా ఖర్చు చేశాడు.

స్విగ్గి కంపెనీ ఆడిటింగ్‌లో ఈ కుంభకోణాన్ని కనిపెట్టారు. బీటీఎస్‌ ఎక్స్‌చేంజ్‌ 247 డాట్‌కామ్‌ ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో జూదమాడడం, పెట్టుబడి పెట్టినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘరానా ఉద్యోగిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement