మృత్యుశకటమైన లారీ
దొడ్డబళ్లాపురం: లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దొడ్డ తాలూకా మాకళి వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. బెంగళూరు–హిందూపురం రహదారి మార్గంలోని మాకళి వద్ద పెట్రోల్ ట్యాంకర్ లారీ, కారు ఎదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో ఉన్న బెంగళూరు కోణనకుంటకు చెందిన వసంత్, ఆవలహళ్లికి చెందిన చేతన్ గాయాలతో మరణించారు. కిరణ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గౌరిబిదనూరు నుంచి కారులో వస్తుండగా లారీ మృత్యుశకటంలా ఎదురొచ్చింది. కారు ఒకవైపు నుజ్జునుజ్జయింది. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కారును ఢీ, ఇద్దరు మృతి
దొడ్డ వద్ద యాక్సిడెంటు
మృత్యుశకటమైన లారీ
Comments
Please login to add a commentAdd a comment