బిదరి కళాకారుడు కన్నుమూత
యశవంతపుర: సీనియర్ బిదరి లోహ కళాకారుడు మహమ్మద్ అబ్దుల్ రౌఫ్ (60) గుండెపోటుతో బీదర్‌లోని తమ నివాసంలో కన్నుమూశారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న గురుకుల యోజనలో భాగంగా వెయ్యి మంది నిరుద్యోగులకు లోహంతో బొమ్మలను తయారు చేయాలో శిక్షణనిచ్చి ఉపాధిని చూపారు. ఆయన లోహంతో కళాకృతులను చేయడంలో సిద్ధహస్తుడు. అప్పటి రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీల నుంచి అవార్డులను అందుకున్నారు. రౌఫ్ చేసిన కళాకృతులను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఒరాక్ ఒబామాలకు బహుమతిగా అందించారు.
Comments
Please login to add a commentAdd a comment