శాడిస్టు లవర్
ప్రియురాలి వాహనాలకు నిప్పు
బనశంకరి: ప్రేమను ఒప్పుకోలేదంటూ యువతిపై కోపోద్రిక్తుడైన రౌడీషీటర్ ఆమె కారు, ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన బెంగళూరు చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. హనుమంతనగర ఠాణా పరిధిలో రౌడీషీటర్ అయిన రాహుల్ (25).. కొన్ని ఏళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కానీ ఇటీవల రాహుల్ కు యువతి దూరంగా ఉంటోంది. ఇది తట్టుకోలేని రాహుల్ శనివారం తెల్లవారుజామున తన అనుచరులతో కలిసి యువతి ఇంటి వద్ద కు వెళ్లి ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టాడు. తరువాత సుబ్రమణ్యపుర ఠాణా పరిధిలోని అపార్టుమెంట్‌లో యువతికి మరో ఫ్లాటు ఉండగా అక్కడికి వెళ్లారు. సెక్యూరిటీని బెదిరించి యువతి ఫోటోని చూపించి కార్ల గురించి తెలుసుకుని రెండు కార్లపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టి ఉడాయించారు. దీంతో మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. కానీ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదు మేరకు దుండగుల కోసం గాలిస్తున్నట్లు దక్షిణ డీసీపీ లోకేశ్ జగలాసర్ తెలిపారు.
శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రిలో భార్యభర్తల హైడ్రామా చోటుచేసుకుంది. వివరాలు.. వినోబా నగరలో నివాసం ఉంటున్న దంపతులు గొడవపడడంతో భార్య పురుగుల మందు తాగింది. ఆమె స్నేహితుడు ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించాడు. తరువాత మహిళ భర్త అక్కడకు వచ్చాడు. ఆమె స్నేహితుడు ఉండడంతో అంతా నీవే చేశావు, నీ వల్లే మేం కొట్లాటపడుతున్నాం అని మండిపడ్డాడు. అతనిని కొట్టడానికి వెళ్లడంతో ఇద్దరూ బాహాబాహీకి దిగారు. దీంతో భార్య ఇద్దరినీ విడదీయడానికి ప్రయత్నించగా ఆమెను తోసేశారు. ఇదెక్కడి గోల అని ఆస్పత్రి సిబ్బంది, రోగులు సంభ్రమానికి గురయ్యారు. ఈ గొడవ వీడియోలు వైరల్‌గా మారాయి. దొడ్డపేటె పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
యశవంతపుర: 10 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న తనను కాదని మరో యువకున్ని పెళ్లి చేసుకుందని కిరాతక ప్రేమికుడు రగిలిపోయాడు. పగతో ఎవరూ ఊహించని ఘోరానికి పాల్పడ్డాడు. ఆమె భర్తను బస్సులో చాకుతో పొడిచి హత్య చేయడంతో అందరూ నివ్వెరపోయారు. ఈ భయానక ఘటన ఉత్తరకన్నడ జిల్లా శిరిసి పట్టణం కేఎస్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. శివమొగ్గ జిల్లా సాగర తాలూకా నీచడి గ్రామానికి చెందిన గంగాధర్‌ను దుండగుడు ప్రీతం డిసౌజా కత్తితో ప్రాణాలు తీశాడు.
బస్సులో గొడవ పెట్టుకుని
వివరాలు ఇలా ఉన్నాయి.. శిరిసి యువతిని ప్రీతం ప్రేమిస్తున్నాడు. ఉపాధి కోసం యువతి బెంగళూరుకు వెళ్లింది, అక్కడ పరిచయం అయిన సాగరకు చెందిన గంగాధర్‌ను నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకొంది. అప్పటినుంచి ప్రీతంతో మాట్లాడడం లేదు. దీంతో కసి పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలు శిరిసిలో బంధువుల ఇంట్లో వేడుకకు వచ్చారు. మళ్లీ గంగాధర ఒక్కడే బెంగళూరుకు రావడానికి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ప్రీతం ప్లాన్ ప్రకారం బస్సులో ఉన్నాడు. ముందు సీటులో కూర్చున్న గంగాధరతో కావాలనే గొడవకు దిగాడు. ఆపై చాకుతో ఇష్టానుసారం దాడి చేయడంతో గంగాధర అక్కడే ప్రాణం వదిలాడు. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బస్సు దిగిపోయారు. హంతకుడు స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి దర్జాగా లొంగిపోయాడు. విషయం తెలిసి భార్య పరుగు పరుగున వచ్చి రోదించింది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. గంగాధర భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు, ఆమె ఫోన్లను తనిఖీ చేపట్టారు.
ఆస్పత్రిలో భర్త ఫైటింగ్
బస్సులో ప్రియురాలి భర్త హత్య
ఉత్తర కన్నడ జిల్లా శిరిసిలో ఘోరం
ఠాణాలో లొంగిపోయిన హంతకుడు
శాడిస్టు లవర్
శాడిస్టు లవర్
శాడిస్టు లవర్
Comments
Please login to add a commentAdd a comment