No Headline
కాఫీ తాగాలంటే మరింత ఖర్చు పెట్టాలి
కుబేరులైనా.. కూటికి లేని పేదలైనా రోజూ టీ లేదా కాఫీ తాగుతారు. ఆ విషయంలో సమానత్వం ఉంటుంది. అలాంటి కాఫీ క్రమంగా ధనవంతులకే పరిమితమయ్యేలా ధరలు ఎగబాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు, కాఫీ తోటలకు పలు సమస్యల వల్ల ఆ పంట దిగుబడి క్షీణిస్తోందే తప్ప పెరగడం లేదు. కాఫీ లభ్యత తగ్గడం మూలాన ధర మండిపోతోంది. దేశంలో అత్యధిక కాఫీని ఉత్పత్తి చేసేది కర్ణాటకే అయినా అందులో 70 శాతం ఎగుమతి అవుతుంది. ఏదేమైనా కాఫీ ధరలు పేద, మధ్యతరగతి వర్గాలకు భారమే కానున్నాయి.
బనశంకరి: నిత్య జీవితంతో ముడిపడినది కాఫీనే. కన్నడనాడు అంటే కాఫీ తోటలకు ప్రసిద్ధి. టన్నుల కొద్దీ కాఫీ గింజలు పండుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో తలెత్తిన కాఫీ కొరతతో దేశీయ కాఫీ ధర నింగిని తాకుతోంది. ఇది కాఫీ తోటల యజమానులకు సంతోషదాయకమైతే, కొనుగోలుదారులకు చేదు వార్తే. దేశంలో కాఫీ గింజల ధరలు ఐదేళ్లలో వంద నుంచి 200 శాతం వరకూ పెరిగాయి. కాఫీప్రియుల జేబులకు చిల్లు పడుతోంది. చిక్కమగళూరు, కొడగు, హాసన్, దక్షిణ కన్నడ జిల్లాల్లోని కాఫీ తోటలు ఎక్కువగా ఉన్నాయి.
ధరలు పెంచుతాం: బ్లెండర్స్
కాఫీ రోస్టర్– బ్లెండర్ వ్యాపారులు త్వరలో ధరలను పెంచుతామని తెలిపారు. ఈ వారం ప్రారంభంలో రాష్ట్రంలో 50 కేజీల బరువు కలిగిన రోబస్టా చెర్సి కాఫీ గింజల ధర రూ.12800–13650 పలికింది. అరేబికా పార్చ్‌మెంట్ రకం ధర రూ.27500–28500 మధ్య ఉందని కాఫీ బోర్డు తెలిపింది. బోర్డు సీఈఓ డాక్టర్ కేజీ.జగదీశ్ మాట్లాడుతూ 2016–2019 వరకు రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉత్పత్తి తగ్గింది. ఆ సమయంలో కాఫీ ధర తక్కువగా ఉండేది. మన వద్ద ఉత్పత్తి అయ్యే కాఫీలో 70 శాతం ఎగుమతి కాగా, 30 శాతం మాత్రమే ఉపయోగిస్తామని తెలిపారు. ప్రపంచ మార్కెట్‌కు 60 శాతం కాఫీ అందించే బ్రెజిల్, వియత్నాం నుంచి సరఫరా బాగా తగ్గింది. లండన్, న్యూయార్క్ మార్కెట్లలో కాఫీకి గిరాకీ పెరిగింది, ఫలితంగా ధరలు భగ్గుమంటున్నాయి అని వివరించారు.
త్వరలో కేజీ రూ.వెయ్యికి?
రాష్ట్రంలో 2024 ప్రారంభంలో కిలో కాఫీ పొడి ధర రూ.450 ఉండేది. ఆరునెలల్లో రూ.600, ప్రస్తుతం రూ.850 కి చేరుకుంది. త్వరలో రూ. వెయ్యి దాటినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 500 రోస్టర్లు ఉండగా వాటిలో 300 బెంగళూరులో ఉన్నాయి. గత నాలుగేళ్లలో ప్రపంచంలో కాఫీ ధర పెరగడంతో ఇక్కడ కూడా ఆజ్యం పోసింది. గిరాకీ రానురాను అధికమవుతోందని కాఫీ మండలి సీఈఓ కార్యదర్శి డాక్టర్ కేజీ.జగదీశ్ తెలిపారు. గత ఏడాది నుంచి కాఫీ ధర పెరుగుతూనే ఉంది. ఎగుమతి పెరగడం, ప్రకృతి విపత్తులు, తోటలకు తెగుళ్ల వల్ల పంట లభ్యత తగ్గడం ఇందుకు కారణాలని ఇండియన్ కాఫీ రోస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరికల్ ఎం.సుందర్ తెలిపారు.
కొడగు వద్ద కాఫీ తోట
5 ఏళ్లలో రేటు డబుల్
2021లో కిలో అరెబికా గింజలు సరాసరి రూ.308 ఉంటే, ఇప్పుడు రూ.617 కు చేరాయి. రోబస్టా చెర్సి రకం కిలో రూ.141 ఉంటే, ఇప్పుడు రూ.431 వద్ద ఉంది.
2023–24లో చిక్కమగళూరు జిల్లాలో 93,050 మెట్రిక్ టన్నులు, కొడగులో 1,30,285 మెట్రిక్ టన్నులు, హాసన్‌లో 43,550 మెట్రిక్ టన్నుల కాఫీ పండింది. దేశం ఉత్పత్తిలో ఇది 70 శాతం కావడం గమనార్హం.
కేరళ 72,825 మెట్రిక్ టన్నులు, తమిళనాడు 18,435 మెట్రిక్ టన్నులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
రికార్డు స్థాయికి ధరలు
దేశంలో 70 శాతం ఉత్పత్తి రాష్ట్రంలోనే
ప్రపంచ మార్కెట్లో సరుకు కొరత
సాగుదారులకు తీపి,
కాఫీ ప్రియులకు చేదు
No Headline
Comments
Please login to add a commentAdd a comment