రాజీనామా వైపు హోంమంత్రి చూపు
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి చల్లారేలా కనిపించడం లేదు. హోంమంత్రి జి.పరమేశ్వర్ అసంతృప్త రాగం అందుకున్నారు. కార్యకర్తలు కోరితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం చర్చనీయాంశమైంది. ఎందుకు ఇలా ప్రకటించారన్నది అందరిలో కుతూహలం రేపింది. సీఎం, కేపీసీసీ అధ్యక్షుల మార్పు గురించి చర్చలు జరుగుతున్నపుడే పరమేశ్వర్ రాజీనామా ప్రస్తావన తేవడం వెనుక అర్థమేమిటో తెలియాల్సి ఉంది.
ఢిల్లీకి వెళ్లి రాగానే ఇలా
నాలుగైదు రోజుల క్రితం హైకమాండ్ పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆ తరువాత సొంత నియోజకవర్గం కొరటగెరెలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మీరు చెబితే రాజీనామా చేస్తానని అనడం ఆయనలోని అసమ్మతికి అద్దం పట్టింది. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సాధ్యపడటం లేదు. మీ ఆకాంక్షల ప్రకారం పని చేయడం కావడం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. దీనిని బట్టి సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల సర్కారులో తనకు పొసగడం లేదని వెల్లడి చేశారు. అందుచేత తనను క్షమించాలని, తప్పుకోవడానికి సిద్ధమని చెప్పగానే కార్యకర్తలు వద్దు, రాజీనామా చేయరాదని నినాదాలు చేశారు. అందరూ కాసేపు గందరగోళానికి గురయ్యారు. కాగా, ఢిల్లీలో పార్టీ పెద్దలు ఆయనను మదలించి ఉంటారని, అందుకే అసంతృప్తికి లోనై ఉంటారని భావిస్తున్నారు.
కార్యకర్తల భేటీలో ఆవేదన
కాంగ్రెస్‌లో అసమ్మతికి ఆజ్యం
Comments
Please login to add a commentAdd a comment