తాళి కట్టు శుభవేళ
బనశంకరి: నగరంలో బనశంకరి అమ్మవారి సన్నిధిలో 69 జంటలు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఆదివారం వేకువజామున ఆలయంలో బనశంకరీదేవి మూలవిరాట్ విశేష పూజలు నిర్వహించారు. ఆపై శ్రీబనశంకరి సామూహిక వివాహ వేదిక ఆధ్వర్యంలో వివాహోత్సవం ఆరంభమైంది. సొగసుగా ముస్తాబైన నూతన వధూవరులు ఆసీనులు కాగా వేదమంత్రాలు ప్రతిధ్వనించాయి. పీఠాధిపతి కుమారస్వామి, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి పాల్గొన్నారు. జంటలకు ఉచితంగా మాంగల్యం, చీర, పంచె, కాలి ఉంగరం, పెళ్లిదుస్తులు అందజేశారు. ముహూర్తానికి మూడుముళ్ల వేళ రమణీయంగా సాగింది. అతిథులు, వధూవరులు తల్లిదండ్రులు, బంధువులు తలంబ్రాలు చల్లి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తార, రమేశ్‌గౌడ, ఎన్.నాగరాజు, వేదిక అధ్యక్షుడు ఏహెచ్.బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
బనశంకరీ దేవస్థానంలో
సామూహిక వివాహోత్సవం
ఒక్కటైన 69 జంటలు
తాళి కట్టు శుభవేళ
Comments
Please login to add a commentAdd a comment