పెరిగిన కేఎంసీ ఆస్పత్రి సేవల ధరలు
హుబ్లీ: ఉత్తర కర్ణాటక జిల్లాల పేద వర్గాల పాలిట ఆరోగ్య కల్పకృక్షంగా మారిన కేఎంసీ ఆస్పత్రిలో మంగళవారం నుంచి సేవల ధరలను పెంచారు. దీంతో సామాన్య ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బయట, లోపల రోగుల ఫీజులను పెంచారు. జనన, మరణ ధృవీకరణ పత్రం ఫీజులు పెంచారు. అయితే పెరిగిన ధరలు పేదలకు అంత భారం కావని డైరెక్టర్ డాక్టర్ కమ్మారా అభిప్రాయపడ్డారు. బీపీఎల్ కార్డుదారులకు యథా విధంగా సేవలు అందిస్తామన్నారు. కాగా బయట విభాగ ఫీజు రూ.10 నుంచి రూ.20కి పెంచారు. లోపల రోగుల నమోదుకు ప్రస్తుతం ఉన్న రూ.30ని రూ.50కి పెంచారు. ఎక్స్‌రే, స్కానింగ్, జనన, మరణ ప్రమాణ పత్రాల ధరలు కూడా పెంచారు. ఇంతకు ముందు రూ.5 ఉన్న ధరను ఏకంగా రూ.50కి పెంచారు. మొత్తానికి 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా ధరలను పెంచామని డైరెక్టర్ తెలిపారు. ఈ ధరలను పెంచాలని ఏడాది నుంచి చర్చిస్తున్నామని, అనివార్యంగా ఈసారి పెంచామన్నారు. ఒక వేళ పేదలకు చెల్లించలేని స్థితి ఉంటే అలాంటి రోగులకు ఉచిత చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాణ్యమైన చికిత్స అందించడానికే కొద్ది మేర ధరలను పెంచామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment