పర్యాటకుల్లో భయం..భయం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకుల్లో భయం..భయం

Published Sun, Mar 9 2025 12:22 AM | Last Updated on Sun, Mar 9 2025 12:22 AM

పర్యా

పర్యాటకుల్లో భయం..భయం

సాక్షి,బళ్లారి: హంపీ అంటేనే అదో అద్భుతమైన పర్యాటక కేంద్రంతో పాటు ప్రపంచంలోనే గొప్పగా నిర్మించిన స్మారకాల్లో ఒకటిగా ఖ్యాతి పొందింది. దేశ,విదేశాలకు చెందిన పర్యాటకులకు హంపీ అంటే ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఎంతో ఇష్టంగా వచ్చి హంపీ అందాలను వీక్షిస్తుంటారు. పర్యాటక ప్రాంతంతో పాటు మహిమాన్విమైన, సాక్షాత్తు శివుడే లింగరూపంలో ఉద్భవించారని ప్రతీతి ఉంది. అంతేకాకుండా అయోధ్యలో శ్రీరాముడు జన్మిస్తే హంపీ సమీపంలోని గంగావతి తాలూకా అనెగొంది పక్కనే అంజనాద్రిలో ఆంజనేయుడు జన్మించారని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కిష్కింధ, శ్రీరాముడు ఇక్కడికి వచ్చిన ఆనవాళ్లు, ఆంజనేయ స్వామిని కలిసినట్లు చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్న నేపథ్యం ఉంది. దీంతో గంగావతి, హంపీ చుట్టుపక్కల ఎత్తైన కొండలు, పచ్చని వ్యవసాయ పొలాలు, తుంగభద్ర నదీ ప్రవాహాలతో హంపీ, గంగావతి ప్రపంచంలోనే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న నేపథ్యంలో దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు వారం, పది రోజులు ఇక్కడే విడిది చేసి సేద తీరుతుంటారు.

కుప్పలు తెప్పలుగా హోంస్టేలు

అయితే పవిత్ర పుణ్యక్షేత్రం ఒక వైపు, ప్రపంచ టూరిజంగా ఖ్యాతి మరో వైపు ఉండటంతో ఇక్కడ కుప్పలు తెప్పలుగా హోంస్టేలు వెలశాయి. అంతేకాకుండా అక్రమంగా రిసార్టులు కూడా వెలియడంతో విపరీతమైన అసాంఘీక కార్యకలాపాలు, గంజాయి విక్రయం తదితరాలు చోటు చేసుకోవడంతో హంపీ చుట్టుపక్కల ఇటీవల భయాందోళన పరిస్థితులు ఏర్పడుతుండటంతో పర్యాటకులకు దడ పుట్టిస్తోంది. గత నెల 23న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ అనన్యరావు తుంగభద్ర నదిలో ఈతకొట్టేందుకు వెళ్లి ప్రాణాలను పోగొట్టుకుంది. ఈ ఘటన మరవక ముందే మరో ఘోరమైన సంఘటన చోటు చేసుకోవడంతో దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. హంపీకి, గంగావతికి పరిసరాలకు వీక్షించేందుకు వచ్చిన వారిపై స్థానికంగా ఉంటున్న కొందరు నిఘా ఉంచి వారిపై ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.

పటిష్ట భద్రత ఏదీ?

అయితే రాష్ట్ర ప్రభుత్వం హంపీలో పటిష్టమైన భద్రత కల్పించకపోవడంతో అక్రమ రిసార్ట్‌లు నిఘా ఉంచకపోవడంతో కొందరు యువకులు తప్ప తాగి పర్యాటకులపై దాడులు, అత్యాచారాలు చేయడం వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనలతో దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఒంటరిగా తిరగడం ఎలా? అని భయాందోళన చెందుతున్నారు. పోలీసులు గట్టి గస్తీ విధించకపోవడంతో పాటు రాత్రిళ్లు అయినా పర్యాటకులు హంపీ, గంగావతి పరిసరాల్లో నిషేధిత ప్రాంతాల్లోకి ఎందుకు వెళుతున్నారో కూడా నిఘా ఉంచకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. హంపీ చుట్టుపక్కల వెలసిన రిస్టార్ట్‌లకు ఎన్ని అనుమతులు ఉన్నాయో కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. రిసార్ట్‌లు, హోంస్టేలలో గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా పోలీసు అధికారులు, ప్రభుత్వ పెద్దలు గట్టి చర్యలు తీసుకోకపోవడంతో అనర్థాలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది.

తుంగభద్ర నదిలో తెప్పపై విహరిస్తున్న మహిళ

హంపీ పరిసరాల్లో నిత్యకృత్యంగా అరాచకాలు

యథేచ్ఛగా మత్తు పానీయాలు, గంజాయి విక్రయాలు

మొన్న హైదరాబాద్‌కు చెందిన మహిళ నదిలో గల్లంతు

నేడు విదేశీ పర్యాటకులపై దాడి, అత్యాచారంతో మరింత దడ

No comments yet. Be the first to comment!
Add a comment
పర్యాటకుల్లో భయం..భయం1
1/4

పర్యాటకుల్లో భయం..భయం

పర్యాటకుల్లో భయం..భయం2
2/4

పర్యాటకుల్లో భయం..భయం

పర్యాటకుల్లో భయం..భయం3
3/4

పర్యాటకుల్లో భయం..భయం

పర్యాటకుల్లో భయం..భయం4
4/4

పర్యాటకుల్లో భయం..భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement