వైభవంగా నీలగల్ బసవేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా నీలగల్‌లో బసవేశ్వర రథోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. ఏటా రథోత్సవాన్ని మఠాధిపతి పంచాక్షరి, శాంతమల్ల శివాచార్యల ఆధ్వర్యంలో జరిగింది. రథోత్సవానికి రాయచూరు, మాన్వి, సింధనూరు, దేవదుర్గ, కొప్పళ, బళ్లారి, లింగసూగూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వీడియో వైరల్..
యువకుడి అరెస్టు
హుబ్లీ: కాలితో బైక్ స్టార్ట్ చేయడం ద్వారా పుష్ప సినిమా డైలాగ్ చెబుతూ రీల్ చేసిన యువకుడిని నగర తూర్పు ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి సదరు బైక్‌ను జప్తు చేశారు. గాంధీవాడ నివాసి ఈశ్వర తలంబరి (20) అరెస్ట్ అయిన యువకుడు. రోడ్డులో బైక్‌ను కాలితో స్టార్ట్ చేయడం ద్వారా పుష్ప సినిమా డైలాగ్ చెప్పిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని పోలీసులు పసిగట్టి తక్షణమే ఈశ్వర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఘటనపై తూర్పు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటనలు శుక్రవారం జరిగాయి. రాయచూరు తాలూకా కెరెబూదూరు వద్ద యరగేరాకు చెందిన రామకృష్ణ(32) ద్విచక్ర వాహనంలో వెళుతుండగా వాహనం పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా పగడదిన్ని వద్ద జరిగిన బోలెరో, ఆర్టీసీ బస్సుల మధ్య జరిగిన ప్రమాదంలో బోలెరో వాహన డ్రైవర్ మంజునాథ్(21) మరణించాడు. బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బోలెరోని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రవేశ శుల్కం దుర్వినియోగం.. ఎఫ్‌డీఏ అరెస్ట్
హుబ్లీ: నగరంలోని నృపతుంగ గుట్టలోకి ప్రవేశ శుల్కం రూపంలో వసూలు చేసిన డబ్బులను బ్యాంక్‌లో జమ చేయకుండా వంచించిన కేసుకు సంబంధించి డివిజనల్ అటవీ శాఖ కార్యాలయం ఎఫ్‌డీఏ విశ్వనాథ్‌ను అశోక్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన 2024 జనవరి 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12 వరకు సదరు హుబ్లీ కార్యాలయంలో సేవలు అందించే వారు. అన్ని శాఖల నిర్వహణ చూసే వారు. సబ్ డివిజనల్ అటవీ అధికారి ఎంఎస్ రాయనగౌడర, కాపలా అటవీ సంరక్షకురాలు సుమిత్ర బొమ్మనవాడ సదరు గుట్టలో 2024 మార్చి 1 నుంచి 2025 జనవరి 31 మధ్య గడువులో మొత్తం రూ.15.57 లక్షల ప్రవేశ శుల్కాన్ని సేకరించారు. ఇందులో రూ.8.95 లక్షలను మాత్రమే విశ్వనాథ బ్యాంక్‌లో జమ చేశారు. మిగిలిన డబ్బులను దుర్వినియోగం చేసినట్లు సంబంధిత అటవీ శాఖ అధికారి రామలింగప్ప ఉప్పార పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాలూకా కోర్టు నుంచి
ఖైదీ పరారీ
రాయచూరు రూరల్: మస్కి తాలూకా కోర్టు నుంచి ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ముద్దాయి దొడ్డ దురుగేష్ పరారయ్యాడు. పోలీసులపై చెయ్యి చేసుకున్న దొడ్డ దురుగేష్, చిన్న దురుగేష్‌లను 20 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. వారం రోజుల పాటు రిమాండ్ విధించడంతో చేయని తప్పులకు శిక్ష అనుభవించడం తగదంటూ కోర్టు ఆవరణ నుంచి దొడ్డ దురుగేష్ పరారు కావడంతో వెతకడానికి రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు.
వైభవంగా నీలగల్ బసవేశ్వర రథోత్సవం
వైభవంగా నీలగల్ బసవేశ్వర రథోత్సవం
వైభవంగా నీలగల్ బసవేశ్వర రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment