ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం పడింది. తుంగభద్ర, కృష్ణా నదీతీరాల్లో ఉన్న ప్రాంతాలలో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు దాడులకు పూనుకున్నారు. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ తాలుకాలో అక్రమంగా ఇసుక రవాణా అరికట్టే విషయంలో మాన్వి సీఐ కెంచరెడ్డి శుక్రవారం దాడులు జరిపి 18 టిప్పర్లు, హిటాచీలను స్వాధీనం చేసుకున్నారు. స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగతనంగా తరలించి నిల్వ చేసుకుంటున్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని నదిలో బుల్డోజర్ల ద్వారా గుంతలు పడే విధంగా ఇసుకను తరలిస్తున్నారు. రాయల్టీని రెండింటికి పొంది మిగిలిన వాహనాలకు లేకుండా వందల కొద్ది టన్నులను సరఫరా చేస్తున్నా వాటిని వశ పరుచుకున్నారు. అక్రమంగ ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీస్ కానిస్టేబు ల్‌ౖపై వారం రోజుల క్రితం దాడి జరిగిన ఘటన మాన్విలో చోటు చేసుకుం ది. మాన్వి తాలూకా చీకలపర్వి వద్ద తుంగభద్ర నదీ తీరంలో అక్రమంగ ఇసుకను తరలిస్తుండగా శుక్రవారం సీఐ రెడ్డి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఒకే రోజు 18 టిప్పర్లు స్వాధీనం
మాన్వి సీఐ కెంచరెడ్డి మెరుపు దాడి
ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం
ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం
Comments
Please login to add a commentAdd a comment