కల్లూరు గుడిలో చోరీ.. పరారీలో నిందితులు
రాయచూరు రూరల్: జిల్లాలో పేరు గాంచిన దైవశక్తిగ ప్రసిద్ధి గాంచిన కల్లూరు మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మహాలక్ష్మి ఆలయంలో విగ్రహానికి ఉన్న రూ.25 లక్షల విలువ చేసే బంగారు నగలను దోచుకెళ్లారు. 80 గ్రాముల వేంకటేశ్వర స్వామి కిరీటం, 30 గ్రాముల మహాలక్ష్మి కిరీటం, 140 గ్రాముల పాదాలు, 40 గ్రాముల బిళ్లలు కలిపి మొత్తం 290 గ్రాముల బంగారం చోరీ అయింది. ఈ విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ హరీష్, సిరవార సీఐ శశి కాంత్, ఎస్‌ఐ అమరే గౌడ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం సాధ్యం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కల్లూరు గుడిలో చోరీ.. పరారీలో నిందితులు
Comments
Please login to add a commentAdd a comment