నకిలీ వైద్యుడిపై చర్యలకు డిమాండ్
బళ్లారి అర్బన్: జిల్లాలోని కురుగోడు తాలూకా ఎర్రంగళి గ్రామంలో ఆర్‌ఎంపీ డాక్టర్ యోగానంద బృందం తనపై దాడి చేసిందని, కురుగోడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదని వ్యతిరేకిస్తూ తక్షణమే అరెస్ట్ చేయాలని కర్ణాటక మానవ హక్కుల కావలు సమితి రాష్ట్ర అధ్యక్షుడు యు.ఉరుకుంద డిమాండ్ చేశారు. శుక్రవారం పత్రికా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎంపీ డాక్టర్ యోగానంద్ ఎటువంటి బోర్డు లేకుండా ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకొని నకిలీ వైద్యం చేస్తూ సొమ్ము చేసుకున్న విషయం తమ దృష్టికి రావడంతో ఆరోగ్య శాఖ అధికారి డీహెచ్‌ఓ రమేష్‌బాబుకు మనవి పత్రం అందించినా నిర్లక్ష్యం వ్యవహరించడంతో తాను ఈనెల 9న ఎర్రంగళిలోని క్లినిక్‌కు వెళ్లి డాక్టర్ యోగనంద్‌ను ప్రశ్నించగా తమపై 50 నుంచి 100 మందితో దాడికి పాల్పడటంతో తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ చేయించి కురుగోడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి నకిలీ వైద్యుడిని తక్షణమే శిక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు మల్లప్ప ఉప్పార్, హుల్లురు సిద్దేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment