ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం న్యూఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రదాన మంత్రి నరేంద్ర మోదీలు మొండి చెయ్యి చూపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, దేశంలో బీజేపీ సర్కార్‌లు కలసి రాయచూరులో మహాత్మగాంధీ మైదానంలో 1045వ రోజుకు ఆందోళన చేపట్టిన విషయం గుర్తు చేశారు. రాజకీయ నాయకుల చిత్తశుద్ది లోపంతో పాటు మంజూరుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు.
ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
Comments
Please login to add a commentAdd a comment