ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్ష
ఖమ్మంమయూరిసెంటర్ : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025 – 26 విద్యా సంవత్సరంలో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ప్రవేశ పరీక్ష ఆదివారం భద్రాద్రి జోనల్‌లో ప్రశాంతంగా ముగిసింది. జోనల్‌లో ఉన్న ఖమ్మం జిల్లాలో 18 కేంద్రాలు, భద్రాద్రి జిల్లాలో 18 కేంద్రాలు, మహబూబాబాద్ జిల్లాలో 15, హనుమకొండ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 10 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జోనల్ అధికారిణి కె.స్వరూపరాణి తెలిపారు. మొత్తం 77 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశానికి 13,042 మందికి గాను 12,806 మంది హాజరయ్యారని, 236 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 5,163 మందికి 4,881 మంది, ఏడో తరగతికి 2,852 మందికి 2,758, 8వ తరగతికి 2,485 మందికి గాను 2,410 మంది, 9వ తరగతికి 1,775 మందికి గాను 1,701 మంది హాజరయ్యారని వివరించారు. జోనల్‌లో వ్యాప్తంగా అన్ని తరగతులకు కలిపి 25,317 మందికి గాను 24,556 మంది హాజరయ్యారని, 761 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
ఆదాయం అధికంగా ఉందని నిరాకరణ
ఖమ్మంరూరల్ : మండలంలోని మద్దులపల్లి ఎస్‌బీసీఈ కళాశాలలో జరిగిన ప్రవేశపరీక్షకు మోదుగు కృష్ణమనోహర్, ఎం. ధీరజ్ అనే ఇద్దరు విద్యార్థులను అనుమతించలేదని, దరఖాస్తు సమయంలో తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2లక్షల కంటే అధిక ఆదాయం నమోదు చేయడమే ఇందుకు కారణమని జోనల్ అధికారిణి స్వరూపారాణి తెలిపారు. హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా వచ్చాయని, ఈ క్రమంలో వీరిద్దరి పేర్లూ తిరస్కరణకు గురయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు సమాచారం అందించామని చెప్పారు.
25,317 మంది విద్యార్థులకు
24,556 మంది హాజరు
ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్ష
Comments
Please login to add a commentAdd a comment