వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు..
ఖమ్మంలో నిర్వహించిన శత సహస్ర హనుమాన్ చాలీసా పారాయణానికి ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ అవార్డులు దక్కాయి. ఈ వేడుకను పరిశీలించాల్సిందిగా శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి దరఖాస్తు చేయగా అవార్డు సంస్థలు హాజరయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా కార్యక్రమం నిర్వహించారంటూ అభినందించిన సంస్థల ప్రతినిధులు ఈ రెండు అవార్డులకు ఎంపిక చేశాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కో–ఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్ శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావుకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి గన్నవరపు నాగేశ్వరరావు, డైరెక్టర్లు లగడపాటి రామారావు, ప్రతాపని నర్సింహారావు, కటకం చిన్న హనుమంతరావు, మోతుకూరి మురళీధర్, పుల్లఖండం సురేష్, బిజ్జాల దుర్గ పాల్గొనగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment