శివరాత్రికి ప్రత్యేక బస్సులు
● ఈ నెల 25, 26, 27 తేదీల్లో తిప్పనున్న సర్వీసులు ● రీజియన్ పరిధిలో 75 బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: మహాశివరాత్రి పర్వదినాన్ని ఈనెల 25, 26, 27 తేదీల్లో పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు సమీప డిపోల నుంచి ఈ సర్వీసులు నడిపేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి జిల్లాలోని తీర్థాల, స్నానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డిపల్లి, మోతెగడ్డ, బెండాలపాడు శైవ క్షేత్రాలకు ఖమ్మం రీజియన్‌లోని పలు డిపోల నుంచి 75 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అదనపు చార్జీలతో నడిపే ఈ సర్వీసుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని సైతం వర్తింపజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
Comments
Please login to add a commentAdd a comment