నేటి నుంచి టెన్నిస్ నాకౌట్ మ్యాచ్‌లు
ఖమ్మంస్పోర్ట్స్: ఆల్ ఇండియా ర్యాంకింగ్ పురుషుల టెన్నిస్ పోటీలు సోమవారం నుంచి నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే ర్యాంకింగ్‌లో నిలిచిన 32 మంది హాజరు కాగా క్వాలిఫయింగ్ పోటీల్లో మరో 13 మంది క్వాలిఫై కావడంతో వారికి నాకౌట్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ర్యాంకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, రూ.2.50 లక్షలకు పైగా నగదు బహుమతులు అందించనున్నామని నిర్వాహకులు చల్లపల్లి శ్రీనివాస్, డాక్టర్ కాసినేని అనిల్‌కుమార్, కాంపాటి సత్యనారాయణ తెలిపారు. మూడు టెన్నిస్ కోర్టులు సిద్ధం చేశామని వివరించారు. కార్యక్రమంలో రిఫరీ ప్రవీణ్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment