
కదం తొక్కిన విద్యార్థులు
ఖమ్మంమయూరిసెంటర్ : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం వీధుల్లో విద్యార్థులు శుక్రవారం కదం తొక్కుతూ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని జెడ్పీసెంటర్ వద్ద ప్రముఖ విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా వైరా రోడ్ మీదుగా భక్త రామదాసు కళాక్షేత్రానికి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు, భగత్ సింగ్, చేగువేరా ప్లకార్డులు, కోలాటం, డప్పు నృత్యాలతో సాగిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం సభ ప్రారంభానికి ముందు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి జెండా ఆవిష్కరించగా.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు.
ఖమ్మంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
నగరంలో భారీ ప్రదర్శన

కదం తొక్కిన విద్యార్థులు