చింతలమానెపల్లి: పోడు రైతులకు అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం పేర్కొన్నారు. శనివారం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని దిందా, కోర్సిని, గంగాపూర్, గూడెం, ఖర్జెల్లి, బూరెపల్లి, అంబగట్ట గ్రామాల్లో 70 ఏళ్లకు పైగా రైతులు పోడు సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సాగు పనులకు వెళ్లిన రైతులను అటవీ అధికారులు అడ్డుకుని కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు తెలిపి పోడు సమస్య పరిష్కరించి ఎన్నికల హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్‌గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎల్ములె మల్లయ్య, నాయకులు డోకె రామన్న, కుంచాల విజయ్, తిరుపతిగౌడ్, జగదీశ్ తివారి, ఒడీల శంకర్ ఉన్నారు.