కాగజ్‌నగర్‌రూరల్: వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. మండలంలోని నజ్రూల్‌నగర్ విలేజ్ నం.2, 12 గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. వడగళ్లవానతో నష్టపోయిన మామిడి తోటలు, మొక్కజొన్న పంటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట చేతికొచ్చే దశలో రైతులకు అపార నష్టం జరిగిందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు పూర్తిస్థాయి సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పకడ్బందీగా అమలు చేస్తే అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన రైతులను ఆదుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు బికాస్ ఘరామీ, మాజీ ఎంపీపీలు మనోహర్‌గౌడ్, కొప్పుల శంకర్, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి అమిత్ బిశ్వాస్, మాజీ ఉప సర్పంచ్ సమీర్‌గుప్తా, దీపక్ గెయిన్, అషుతోష్ మండల్, గోవింద్ మండల్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు