చల్లపల్లి: తన ప్రమేయం లేకపోయినా తనను తోటి ఉద్యోగి అల్లరి చేస్తున్నా డని మనస్తాపానికి గురైన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన గురువారం చలపల్లిలో జరిగింది. చల్లపల్లి నారాయణరావునగర్ కాలనీకి చెందిన వరిగంజి నాగార్జున అవనిగడ్డ ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాగార్జునకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని అతనితోపాటు పాటు పనిచేస్తున్న రమేష్ కొంత కాలంగా అల్లరి చేస్తున్నాడు. దీంతో నాగార్జున మనస్తాపం చెందాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు రమేష్ కారమని చెబుతూ పురుగుమందు తాగుతూ తీసిన సెల్ఫీ వీడియోను స్నేహితులకు పంపాడు. వెంటనే అతని స్నేహితులు నాగార్జున ఇంటికి వెళ్లి అతడిని చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం నాగార్జున పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మచిలీపట్నం నుంచి వివరాలు రావాల్సి ఉందని వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామని చల్ల పల్లి పోలీసులు తెలిపారు.