
8 నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి చైత్రమాస బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో ఆదిదంపతులకు పలు విశేష వాహన సేవలు జరుగుతాయి. 8వ తేదీ వెండి పల్లకిపై, 9న వెండి రథోత్సవం, 10వ తేదీ రావణ వాహనంపై, 11వ తేదీ నంది వాహనంపై, 12వ తేదీ సింహ వాహనంపై, 13వ తేదీ సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో విహారం ఉంటుంది. ఉత్సవాల్లో తొలిరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద రాయబార ఉత్సవం(ఎదుర్కోలు ఉత్సవం) జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10.30 గంటలకు ఆది దంపతుల దివ్య కల్యాణోత్సవం చేస్తారు. 12వ తేదీ సదస్యం, వేదస్వస్తి, వేదాశీస్సుల కార్యక్రమాన్ని మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, వసంతోత్సవం, ధ్వజావరోహణతో ఉత్సవాలు పరి సమాప్తమవుతాయి. 14వ తేదీ ద్వాదశ ప్రదక్షిణలు, 15, 16 తేదీల్లో పవళింపు సేవలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.