ఉపాధ్యాయులకు తలనొప్పిగా ఎస్‌ఏ–1 పరీక్షలు
ఆలూరు రూరల్: పరీక్షలు నిర్వహించాలంటే ఉపాధ్యాయులు హడలెత్తిపోతున్నారు. ప్రతిరోజు పరీక్షకు గంట ముందు ఎంఈఓ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌లో భద్రపరిచిన పరీక్షా పత్రాలు తెచ్చుకోవాల్సి ఉంది. రోజు రెండు సార్లు ఉదయం,మధ్యాహ్నం ప్రశ్న పత్రాలు తెచ్చుకుంటున్నారు. ఆయా మండల కేంద్రాల్లోని ఉపాధ్యాయులకు వెసులుబాటు ఉంటుంది. కానీ గ్రామాల్లోని పాఠశాలల ఉపాధ్యాయులకు వెసులుబాటు ఉండదు. ఒక్కొ గ్రామం మండల కేంద్రానికి 5 నుంచి 25 కిలో మీటర్లు దూరం కూడా ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులు అంత దూరం రెండు సార్లు వెళ్లి ప్రశ్న పత్రాలు తీసుకురావాలంటే తలకు మించిన భారంగా మారింది.
పోలీసు స్టేషన్ నుంచే ప్రశ్నపత్రాల పంపిణీ
ఎస్‌ఏ–1 పరీక్షలలో భాగంగా సోమవారం జరగాల్సిన లెక్కల పరీక్ష లీక్ కావడంతో ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రశ్న పత్రాలను ఎంఈఓ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్‌లో భద్రపరిచారు. దీంతో మంగళవారం నుంచి అన్ని పాఠశాలలలకు ప్రశ్నాపత్రాలు ఉపాధ్యాయులకు ఎంఈఓ ఆధ్వర్యంలో సిబ్బంది పంపిణీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment