కొనసాగుతున్న పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీలు
నంద్యాల(న్యూటౌన్): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం రెండో రోజు క్రీడాపోటీలు కొనసాగాయి. చెస్ బాలికల విభాగంలో దివ్య(బేతంచెర్ల), బ్యాడ్మింటన్ డబుల్స్ బాలుర విభాగంలో అజయ్‌కుమార్, అమీర్(కేవీఎస్‌ఆర్ కర్నూలు), బాలికల విభాగంలో ప్రవళ్లిక, ఎస్.అంజుమ్(నంద్యాల) అథ్లెటిక్స్ 200 మీటర్స్ రన్ బాలికల విభాగంలో అఖిల(బేతంచెర్ల), బాలుర విభాగంలో సూరజ్‌కుమార్(కర్నూలు), 400 మీటర్స్ రన్ బాలికల విభాగంలో స్పందన(నంద్యాల), బాలుర విభాగంలో హరిప్రసాదరెడ్డి(నంద్యాల), జవాలీన్ త్రో బాలుర విభాగంలో ఎస్.కృష్ణనాయక్(శ్రీశైలం) విజేతలుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment