ఇవీ కష్టాలు..
● ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో మెడికల్ కేసులకు స్థానం ఉండటం లేదు.
● వైరల్ ఫీవర్లు, విరేచనాలు, పక్షవాతం, తీవ్ర ఆయాసం వంటి వ్యాధులతో ఆసుపత్రికి వస్తే వాటికి ఆరోగ్యశ్రీ ఉన్నా ఆసుపత్రులు చేర్చుకోవడం లేదు.
● చికిత్సకు డబ్బులు ఇస్తామంటే ఆసుపత్రిలో చేర్చుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
● పక్షవాతం(బ్రెయిన్‌స్ట్రోక్)లో మెదడులో నరాలు చిట్లితే మాత్రం కర్నూలు నగరంలో కేవలం ఒకటి, రెండు ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారు. దీంతో పక్షవాతం వచ్చిన వారంతా అధిక శాతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే చికిత్స చేయించుకుంటున్నారు.
● కూటిమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లకు చేరుకున్నాయని వైద్యులు చెబుతున్నారు.
50 రోజులుగా
ఈహెచ్‌ఎస్ బంద్
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్సను అందుకునే వీలుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇందుకు సంబంధించి బకాయిలు, ప్యాకేజీల గురించి ఎలాంటి హామీ రాకపోవడంతో గత 50 రోజులుగా నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలను నిలుపుదల చేశాయి. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు నగదు వైద్యం చేయించుకుంటున్నారు. ఈ విషయమై ఉద్యోగ సంఘాలు, నెట్‌వర్క్ ఆసుపత్రులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చలనం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేయవచ్చు
ఏ ఆసుపత్రిలోనైనా ఎన్‌టీఆర్ వైద్యసేవ పథకంలో డబ్బులు వసూలు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మా కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. అలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం. తరచూ నెట్‌వర్క్ ఆసుపత్రులతో సమావేశాలు నిర్వహించి రోగుల నుంచి డబ్బులు వసూలు చేయకూడదని చెబుతున్నాం. – భాస్కర్‌రెడ్డి,ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment