గవర్నర్‌ను కలసిన ఆర్‌యూ వీసీ
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.వి.బసరావు శుక్రవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్‌యూ అభివృద్ధికి రాజ్‌భవన్ సహాయ సహకారాలు ఉంటాయని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వీసీ పేర్కొన్నారు. వర్సిటీలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడంపై దృష్టి సారించాలని సూచించారన్నారు. విద్యా రంగంలో ఉమ్మడి జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేయాల్సిందిగా సూచించారని పేర్కొన్నారు.
మిల్లెట్ బేకింగ్‌పై
10న శిక్షణ
కర్నూలు (టౌన్): కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్ర ప్రెన్యూర్స్ (సీఓడబ్ల్ల్యూఈ ) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల10వ తేదీన ‘మిల్లెట్ బేకింగ్’పై మహిళలకు శిక్షణ కార్యక్ర మం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంస్థ అధ్యక్షురాలు రాధిక ఒక ప్రకటన వి డుదల చేశారు. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల,ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమావేశ హాళ్లలో, పత్తికొండలోని సీ్త్రశక్తి భవన్‌లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వివరాలకు 94908 80172 ను సంప్రదించాలని సూచించారు.
ముగిసిన వాదనలు
కర్నూలు(టౌన్): సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి సంబంధించి బెయిల్ పిటిషన్ వాదనలు శుక్రవారం ఆదోని కోర్టులో ముగిసాయి. కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు సువర్ణ రెడ్డి వేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున ఆదోని సీనియర్ ఏపీపీ వాదించారు. సుదీర్ఘంగా రెండు గంటల పాటు ఇరువురి వాదనలు సాగాయి. బెయిల్ పిటిషన్‌కు సంబంధించి కోర్టు తీర్పును రిజర్వు చేసింది. అలాగే పోలీసు కస్టడీకి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని మొదటి అదనపు జ్యుడీషిషల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అపర్ణా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment