ఉపాధి చూపండి.. సారా మానుకుంటాం!
కర్నూలు : ‘‘ఉపాధి చూపండి.. సారా తయారీ మా నుకుంటాం’’ అంటూ కర్నూలు బంగారుపేటలో నివాసముంటున్న నీలిషికారీల మహిళలు ఎకై ్సజ్ అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 పేరుతో బంగారుపేటలో అవగాహన సదస్సు నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు శుక్రవారం కార్యక్రమానికి హాజరయ్యా రు. ఈ సందర్భంగా సభలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మాట్లాడుతుండగా.. నీలిషికారీ మహిళలు ఒక్కసారిగా లేచి తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకొచ్చారు. ‘‘కొన్నేళ్ల నుంచి నీలి షికారీలుగా జీవనం సాగిస్తున్నాం.. ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. కులం సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు’’ అని చెప్పారు. ‘ఉపాధి చూపండి.. సారా మానుకుంటాం’ అంటూ మహిళలు నిలదీయడంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. నీలిషికారీ మహిళల నుంచి చుక్కెదురు కావడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో నీలిషికారీ మహిళలు శాంతించారు. నాటుసారాతో అనర్థాలను అధికారులు వివరించి.. సారా తయారీని మానుకుంటామంటూ మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు, మెప్మా, ఐసీడీఎస్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బంగారుపేటలో ఎకై ్సజ్ అధికారులను నిలదీసిన షికారీలు
Comments
Please login to add a commentAdd a comment