
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కర్నూలు(సెంట్రల్): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది అన్నారు. ప్రమాదం ఎటునుంచి వచ్చినా తట్టుకోగలిగే సామర్థ్యాన్ని మహిళలు పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షుడు ఎం.వెంకట హ రినాథ్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి భూపాల్‌రెడ్డి, ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జ్యోత్స్నదేవి, ఎకై ్సజ్ కోర్టు సరోజమ్మ హాజరయ్యారు. మహిళా జడ్జీలను సన్మానించారు.
లోక్ అదాలత్‌లో
పది వేల కేసుల పరిష్కారం
కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పది వేలకు పైగా కేసులు పరిష్కారం జరిగినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 చోట్ల జాతీయ లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కక్షిదారుల కేసులు పరిష్కారం చేసినట్లు చెప్పారు. కర్నూలులో 5 బెంచీలు ఏర్పాటు చేసి న్యాయమూర్తులు జి.భూపాల్ రెడ్డి, లక్ష్మిరాజ్యం, జ్యోత్స్నదేవి, ఎం.సరోజనమ్మ, విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి 4,500 కేసులు పరిష్కారం చేశారన్నారు. నంద్యాలలో 1,021, ఆదోనిలో 432, ఆళ్లగడ్డలో 554, ఆలూరులో 291, ఆత్మకూరులో 319, బనగానపల్లెలో 714, డోన్‌లో 630, కోవెలకుంట్లలో 402, నందికొట్కూరులో 266, పత్తికొండలో 427, ఎమ్మిగనూరులో458 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు.
పొట్టేళ్లు అ‘ధర’ హో..
కోడుమూరు రూరల్: బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చాలామంది ప్రజలు చికెన్‌ను వదిలేసి మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పొట్టేళ్లకు గిరాకీ పెరిగింది. శనివారం కోడుమూరులో జరిగిన సంతలో ఒక్కో పొట్టేలు సైజును బట్టి రూ.10వేల నుంచి రూ.20వేలకు పైగా పలికింది. పొట్టేళ్ల ధరలు భారీగా ఉన్నప్పటికీ ప్రజలు కొనేందుకు ఎగబడ్డారు.
నేడు జూడో ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): ఆలూరు పట్టణంలోని ప్రభు త్వ బాలుర పాఠశాలలో ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జూడో సంఘం కార్యదర్శి చంద్రయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 15, 16 తేదీల్లో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
Comments
Please login to add a commentAdd a comment