
చంద్రబాబు సృష్టించిన సంపద అప్పులే!
కర్నూలు(టౌన్): గత ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 9 నెలల వ్యవధిలోనే రూ.1.39 లక్షల కోట్ల అప్పు చేశారని, ఇదే ఆయన సృష్టించిన సంపద అని ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి ఎలాగైన రావాలన్న ఉద్దేశంతో ప్రజలకు లేనిపోని హామీలన్ని చంద్రబాబు ప్రకటించారన్నారు. ఇప్పుడేమో నిధులు లేవంటూ ఉన్నారన్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా.. అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎన్టీఆర్ అంటే రూ. 2 కిలో బియ్యం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అంటే అమ్మ ఒడి, రైతు భరోసా.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన హయాంలో ప్రజలకు చేసిన ఒక్క మంచి పథకం పేరు చెప్పాలన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలను ప్రజలు క్షమించబోరన్నారు.
ఆలూరును పట్టించుకోని ప్రభుత్వం
ఆలూరు నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆరోపించారు. ఆస్పరి మండలంలో మంచి నీళ్లు లేక గ్రామ ప్రజలు వలసలు వెళుతున్నారని, ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా దృష్టికి తీసుకువచ్చామన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఆలూరు ఎమ్మెల్యే
బూసినే విరూపాక్షి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment