మూడు రోజుల వైద్య శిబిరం
వెల్దుర్తి: చిన్నారులు అనారోగ్యం పాలయ్యారన్న సమాచారం తెలుసుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శాంతికళ, డీపీఓ భాస్కర్ ఆదివారం వెల్దుర్తి సీహెచ్‌సీ, రత్నపల్లె గ్రామాన్ని సందర్శించారు. చిన్నారులకు విషజ్వరాలు కావని తేల్చుకుని మూడు రోజుల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎంపీడీఓ డీఐఓ నాగప్రసాద్, సంచార వైద్య చికిత్స నోడల్ అధికారి రఘు, రామళ్లకోట పీహెచ్‌సీ వైద్యాధికారి భువనతేజ, రత్నపల్లె సర్పంచ్ ఫక్కీరమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment