
కుటుంబంలో ఐదుగురికి అస్వస్థత
● ఆహారం విషతుల్యమే
కారణమంటున్న వైద్యులు
పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామంలో ఒకే కుటుంబంలో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 4న ఉదయం గ్రామానికి చెందిన సోమేశ్వరుడు, అతని తల్లి శివమ్మ, భార్య లావణ్య, కూతురు నిఖిత, కుమారుడు భరత్ సద్దన్నం (ఎగ్ రైస్, టమాటా రైస్‌గా చేసుకొని) తిన్నారు. వీరందరికి వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక పీహెచ్‌సీని ఆశ్రయించారు. డాక్టర్లు నాగలక్ష్మి, గులాబ్‌షా ప్రథమ చికిత్స చేసి ఆత్మకూరుకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. స్థానిక వైద్యులు నాగలక్ష్మి, గులాబ్‌షా మాట్లాడుతూ అస్వస్థతకు విషతుల్యమైన ఆహారం తినడమే కారణమని, అయని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆదోని సెంట్రల్: పట్టణంలోని అమరావతినగర్‌కు చెందిన ముల్లనూర్ మొహమ్మద్(32) శనివారం రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే ఎస్‌ఐ గోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.