
నాటుసారా స్థావరాలపై దాడులు
కర్నూలు (టౌన్): నగర పరిధిలోని బంగారుపేటలో నాటు సారా స్థావరాలపై శనివారం ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు, కళాజాతా ద్వారా నాటు సారా నిర్మూలనపై అవగాహన కల్పించారు. 600 లీటర్ల ఊట, 10 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. నీలి షికారీ కాజల్‌ను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రెహెనా తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది చంద్రహాస్, రామలింగమయ్య, సుదర్శన్, రాజు, రామచంద్రుడు పాల్గొన్నారు.
కొనసాగుతున్న సోదాలు
కర్నూలు (సెంట్రల్): అక్రమ రేషన్ బియ్యంపై విజిలెన్స్, పౌర సరఫరాల అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం 86, 87, 51 రేషన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 86వ షాపులో 89 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉండటంతో 6ఎ కేసు నమోదు చేశారు. 51వ రేషన్ షాపులో ఈ–పాస్ మిషన్‌తో పోల్చితే స్టాక్ సరితూగింది. అలాగే కేఎల్ 82067 అనే ఎండీయూ వాహనాన్ని తనిఖీ చేయగా కొలతల్లో తేడాలు లేనట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.