
ప్రజలను మోసగించిన కూటమి నేతలు
కొలిమిగుండ్ల: ఎన్నికల సమయంలో కూటమి నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. మంగళవారం కొలిమిగుండ్లలోని పార్టీ కార్యాలయంలో జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగా మండల అధ్యక్షులు, పార్టీ నూతన మండల కమీటీలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాటసాని మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే పట్టుకొమ్ములన్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్తగా ఎన్నికై న అనుబంధ విభాగాల నాయకులు కష్టపడాలని సూచించారు. ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్‌లో తమ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి బీసీ ఉన్నారనే అండతో స్టేషన్‌లో పోలీసులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ శ్రేణుల కోసం ఏదైనా అవసరం అనుకుంటే తానే స్వయంగా స్టేషన్ ఎదుట ధర్నా చేసేందుకై నా సిద్ధమని భరోసా ఇచ్చారు. అరాచకాలు, వేధింపులకు రాబోయే రోజుల్లో వంద శాతం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
సిమెంట్ యాజమాన్యాల తీరు సరికాదు
వైఎస్సార్‌సీపీ హయాంలో అన్ని విధాలా మద్దతిచ్చి రామ్‌కో, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీల పరిశ్రమలు ఏర్పాటుకు సహకరించామని కాటసాని రామిరెడ్డి అన్నారు. అప్పట్లో పెట్నికోట సమీపంలో ఏర్పాటువుతున్న అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ సభకు హాజరైన బీసీ జనార్దనరెడ్డి ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నట్లు బహిరంగంగా చెప్పారన్నారు. వద్దన్న వాళ్లకే యాజమాన్యాలు పనులు కట్టబెడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులకు మొండిచేయి చూపిన తీరు సరికాదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ మహేశ్వరరెడ్డి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, యువజన విభాగం నియోజవర్గ అధ్యక్షుడు పేరం నందకిషోర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రామాంజనేయులు, వైస్‌ఎంపీపీ క్రిష్టారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి పాల్గొన్నారు.
పార్టీ శ్రేణుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

ప్రజలను మోసగించిన కూటమి నేతలు