పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్, మోడల్ స్కూల్ కళాశాలలను మంగళవారం కలెక్టర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 9,317 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు కల్పించామని, సీసీ కెమెరాల మధ్య పరీక్షలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, డీఎస్పీ తిరుపతిరావు, డీఈఓ రవీందర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment