దేహదారుఢ్యానికి క్రీడలు అవసరం
మహబూబాబాద్: క్రీడలు మానసికోల్లాసానికి, దే హదారుఢ్యానికి దోహదపడతాయని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధి కారం సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు క్రీడలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం క్రీడల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె. వీరబ్రహ్మచారి, టీజీఓ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌రఫి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment