ఖండాంతరాలు దాటిన ప్రేమ
● ఒక్కటైన కొలంబియా యువతి, కేసముద్రం యువకుడు
కేసముద్రం : కొలంబియా యువతి, కేసముద్రం యువకుడు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్‌కి చెందిన సాయిచైతన్య ఆస్ట్రేలియాలో ఓ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొలంబియా దేశానికి చెందిన రియా అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు. వారి అంగీకారంతో గురువారం కేసముద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు.
ఖండాంతరాలు దాటిన ప్రేమ
Comments
Please login to add a commentAdd a comment