అర్ధశతాబ్దపు ఆనందహేళ
బయ్యారం: అర్ధశతాబ్దం తర్వాత కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను నెరమువేసుకున్నారు. చిన్న పిల్లల్లా ఎగిరి గంతేశారు. బయార్యరం బాలుర ఉన్నత పాఠశాలలో 1971–72వ సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. వారందరికీ ఆరుపదుల వయసు దాటినప్పటికీ.. చిన్న పిల్లల్లా మారి ఎగిరి గంతేశారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులు వెంకట్‌రెడ్డి, నారాయణరావు, మోహనాచారితో పాటు పాఠశాల ప్రస్తుత హెచ్‌ఎం దేవేంద్రాచారిని సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సాంబశివరావు, ఆర్.వి.ప్రసాదరావు, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సుధారాణి, సరోజిని, అమృత, రాంబాబు, రామారావు, సర్వోత్తమరెడ్డి, బాబురావు, వెంకటేశ్వర్లు, భిక్షం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment