భద్రాచలానికి గోటి తలంబ్రాలు
ఖానాపురం: మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో గత తొంబై రోజులుగా గోటితో ఒలిచిన తలంబ్రాలకు పూజారి పర్వతపు శివప్రసాద్‌శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు. గోటితో ఒలిచిన తలంబ్రాలను భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణమహోత్సవానికి తరలించారు. అక్కడ ఆలయంలో తలంబ్రాలతో కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మరికొన్ని తలంబ్రాలను తీసుకొచ్చి కల్యాణ వేడుకలను చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావు తెలిపారు.
గూడూరు: సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగించే గోటి తలంబ్రాలను భక్తులు శుక్రవారం గూడూరు నుంచి భద్రాచలం చేర్చారు. శ్రీరామ నవమికి ముందు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోటితో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాల కోసం తరలిస్తారు. ఈ క్రమంలో గూడూరు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో గత నెల 24 నుంచి భక్తులు ధాన్యాన్ని గోటితో ఒలిచే కార్యక్రమం చేపట్టారు. హిందూ జాగరణ సమితి, సేవికా సమితి మహిళలు అందరూ కలిసి గోటి తలంబ్రాలను భద్రాచల రాములవారి దేవాలయానికి చేర్చారు. హోలీ పండుగ సందర్భంగా అక్కడ రంగులు చల్లుకొని సంబురాన్ని పంచుకున్నట్లు మహిళలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment