విద్యుదాఘాతంతో యువరైతు మృతి
సంగెం: విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీఆర్‌ఎన్ తండాకు చెందిన గుగులోత్ సురేష్(27)కు భార్య రేణుక, ఇద్దరు కవలు మనోహర్, మణిదీప్, కూతురు మనీషా ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబపోషణ చేసుకుంటున్నాడు. తన ఎకరం భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం మొక్కజొన్నకు నీరు పారించేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్‌చేస్తే పని చేయకపోవడంతో ఫ్యూజులు సరిగా ఉన్నాయా.. లే దోనని ఫ్యూజులు, స్టాటర్ ఉన్న బాక్స్‌లో చేయి పెట్టి తీసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై కేకలు వేసి పడిపోయాడు. పక్క చేనులో ఉన్న అదే తండాకు చెందిన గుగులోత్ రాజు వచ్చి సురేష్‌ను లేపబోయేసరికి అతనికి విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరు పడి కొట్టుకుంటుండగా మరో చేనులో ఉన్న రాజు వచ్చి దగ్గరలోని విద్యుత్ స్తంభంపై తీగలను తొలగించా డు. సురేష్‌ను ద్విచక్రవాహనంపై ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ముందుగా సురేష్‌ను కాపాడబోయిన రాజు తృటిలో ప్రా ణాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ పేర్కొన్నారు.
విద్యుత్ మోటారు ఫ్యూజులు
సరిచేస్తుండగా ఘటన
Comments
Please login to add a commentAdd a comment