రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి | - | Sakshi

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

Published Sun, Mar 16 2025 12:52 AM | Last Updated on Sun, Mar 16 2025 12:52 AM

రైతులకు ఇబ్బందులు  లేకుండా చూడాలి

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

అదనపు కలెక్టర్‌ వీరబ్రహ్మచారి

మహబూబాబాద్‌: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించాలని అదనపు కలెక్టర్‌ కె.వీరబ్రహ్మచారి ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో శనివారం వ్యవసాయ, నీటి పారుదల శాఖ అధి కారులతో సాగు నీరు సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగు నీటి సరఫరా విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని, అలాంటివి జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డీఏఓ విజయ నిర్మల, ఇరిగేషన్‌ శాఖ ఈఈ నర్సింహరావు, అధికారులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

నర్సింహులపేట: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ వీరబ్రహ్మచారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement