వైద్యానికి నిధులు
జిల్లా ఏర్పాటుతోపాటు తలమాణికంగా ఉన్న మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణాలు మూడు సంవత్సరాలుగా కుంటి నడకనడుస్తున్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలి. అదేవిధంగా తొర్రూరు, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీల్లో ఉన్న పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా 100 పడకల స్థాయి పెంచుతున్నామని, నర్సింహులపేట, సీరోలు, పెద్దవంగర మండలాల్లో నూతన పీహెచ్‌సీలు మంజూరు చేశారు. కానీ మూడు సంవత్సరాలుగా నిధులు మంజూరు చేయలేదు. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment