దేవాదుల మోటార్లు నడిపించకుండానే పలాయనం
హన్మకొండ: దేవన్నపేటలో మోటార్లు నడిపించిన తర్వాత వరంగల్ నుంచి వెళ్తామని చెప్పిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెల్లారేసరికి పలాయనం చిత్తగించారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం హసన్‌పర్తి మండలం దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద మంత్రులు పూజలు చేసి మోటార్లు ఆన్ చేసేందుకు ప్రయత్నించగా స్టార్ట్ కాలేదన్నారు. దీంతో మంత్రులు అధికారులపై మండిపడ్డారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించారన్నారు. దేవాదుల మెయింటెన్స్‌కు కాంట్రాక్టరకు ఏటా రూ.7 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో 20 శాతం కమీషన్ ఇవ్వనందునే సర్కారు పెద్దలు బిల్లులు విడుదల చేయలేదని ఆరోపించారు. కాంట్రాక్టర్.. సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో సమ్మె చేశారని, దీంతో మెయింటెన్స్ చేయలేదని వి వరించారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి పార్టీలు మారడం, బిడ్డ ఎంపీ సీటు మీద దృష్టి సారించాడే తప్ప రైతుల ప్రయోజనాలు పట్టించుకోలేదన్నారు. త్వరలో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు దేవాదుల పంపు హౌజ్ పర్యటన చేపడుతామన్నారు. సమావేశంలో టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ నా యకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, జోరిక రమేశ్, సల్వాజీ రవీందర్ రావు, నయీమొద్దీన్, బండి రజినీకుమార్, చాగంటి రమేశ్, పోలపల్లి రామ్మూర్తి, ఖలీల్, శ్రీకాంత్‌చారి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment