‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’తో మేలు
హన్మకొండ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని, ఇది దేశ భవిష్యత్‌ను మార్చే నిర్ణయమని బీజేపీ నేత, న్యాయవాది రావు అమరేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక – బీజేపీ దృష్టి కోణం’ అనే అంశంపై జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం వర్క్‌షాపు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతీ సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతుండడంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ చైర్మన్‌గా, హోంమంత్రి అమిత్ షా, గులాంనబీ ఆజాద్, కశ్యప్ ఇలా అన్ని వర్గాల వ్యక్తులతో కమిటీ వేశారని గుర్తుచేశారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో ఒకేసారి రాష్ట్ర, కేంద్ర ఎన్నికలు నిర్వహించి మూడు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తర్వాత నాలుగున్నరేళ్ల పాటు ఎన్నికలు లేకుండా కేవలం పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చన్నారు. వర్క్‌షాపులో మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, దొంతి దేవేందర్‌రెడ్డి, కె.సంపత్‌రెడ్డి, సండ్ర మధు పాల్గొన్నారు.
బీజేపీ నేత, న్యాయవాది
రావు అమరేందర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment