నీటిని పొదుపుగా వాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నీటిని పొదుపుగా వాడుకోవాలి

Published Sun, Mar 23 2025 9:15 AM | Last Updated on Sun, Mar 23 2025 9:09 AM

నీటిన

నీటిని పొదుపుగా వాడుకోవాలి

కురవి: ప్రతిఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని జిల్లా భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వేముల సురేష్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి వృథాను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నరసింహస్వామి, తహసీల్ధార్‌ సునీల్‌కుమార్‌ రెడ్డి, ఎంపీడీఓ వీరబాబు, ఏఓ నరసింహరావు పాల్గొన్నారు.

పుష్‌పుల్‌ రాకపోకలు షురూ

మహబూబాబాద్‌ రూరల్‌: కాజీపేట, విజయవాడ మధ్య నడిచే పుల్‌పుల్‌ రైలు రాకపోకలు శనివారం ప్రారంభమయ్యాయి. వివిధ కారణాలతో జనవరి 25 నుంచి పుష్‌పుల్‌ రైలు రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిలిపేశారు. సుమారు రెండు నెలల అనంతరం మళ్లీ రైలు రాకపోకలు ప్రారంభిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు పేదలు, చిరువ్యాపారులు, అప్‌ అండ్‌ డౌన్‌ చేసే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

ఆర్టీసీకి కొత్త బస్సులు

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపోకు 11 కొత్త బస్సులు వచ్చాయి. ఇదివరకే డిపోలో ఉన్న బస్సుల్లో కొన్ని మరమ్మతుకు గురికాగా వాటి స్థానంలో కొత్తగా వచ్చిన బస్సులను నడిపించనున్నారు. కొత్త బస్సులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కాగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులను ప్రారంభించి మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌

పోటీలకు ఎంపిక

పెద్దవంగర: హైదరాబాద్‌లో నేడు జరుగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు పెద్దవంగర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో సాద్విక, నందిని, అంజలి ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంఈఓ బురారపు శ్రీనివాస్‌, వ్యా యామ ఉపాధ్యాయుడు కంచెర్ల ప్రభాకర్‌ శని వారం విద్యార్థులను అభినందించి రాష్ట్ర స్థా యిలో కూడా ప్రతిభ కనబర్చాలని కోరారు.

అవగాహన కార్యక్రమాలు

నిర్వహించాలి

మహబూబాబాద్‌/నెహ్రూసెంటర్‌: మహిళలకు, గర్భిణులకు, బాలింతలకు హెచ్‌ఐవీ, ఎ యిడ్స్‌, తదితర వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మురళీధర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, బాల రక్ష భవన్‌ సిబ్బంది, చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ సిబ్బందికి అడ్వకేసీ కమిటీ సమావేశం, సెన్సిటైజేషన్‌ వర్క్‌షాప్‌ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీ సర్‌ డాక్టర్‌ శ్రవణ్‌, చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎస్‌.నాగవాణి, సీడబ్ల్యూసీ మెంబర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

8 మంది విద్యార్థుల గైర్హాజరు

మహబూబాబాద్‌ అర్బన్‌: పదో తరగతి వార్షిక పరీక్షలు రెండో రోజు హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 8,158 మందికిగాను 8,177 మంది విద్యార్థులు హాజరుకాగా 8 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలోని పలు పరీక్ష సెంటర్లలో తనిఖీ బృందాలు తనిఖీ చేశారన్నారు.

నీటిని పొదుపుగా  వాడుకోవాలి1
1/2

నీటిని పొదుపుగా వాడుకోవాలి

నీటిని పొదుపుగా  వాడుకోవాలి2
2/2

నీటిని పొదుపుగా వాడుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement