పరీక్షలకు అన్ని ఏర్పాట్లు
నవాబుపేట: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ జయరాంనాయక్, యన్మన్‌గండ్ల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. శనివారం వారు కళాశాలలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా, తాగునీరు తదితరు వసతులు ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఈనెల 5వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారన్నారు.
నేడు ఆర్యసమాజ
వార్షికోత్సవం
జడ్చర్ల టౌన్: పట్టణంలోని ఆర్యసమాజ 71వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు సభ అధ్యక్షుడు గుబ్బ నర్సింహులు తెలిపారు. వేడుకల్లో భాగంగా దయానంద సరస్వతి 201వ జయంతిని నిర్వహిస్తారన్నారు. ఉద యం ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం మాధవీయం నుంచి ఆర్యసమాజం వరకు శోభాయాత్ర, 11గంటలకు దేవయజ్ఙం ఉంటుందన్నారు. ఆర్యప్రతినిధి సభ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, ఉపాధ్యక్షుడు శివకుమార్, వైదిక ఉప న్యాసకులు వేదసింధు హాజరవుతారన్నారు.
బీసీ జేఏసీ సమావేశం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీసీ రాజ్యాధి కార సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో ఉదయం 11గంటలకు రౌండ్ టేబుల్ సమవేశం నిర్వహించనున్నట్లు బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మైత్రి యాదయ్య శనివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఈ సమావేశానికి బీసీ సంఘాలతో పాటు వివిద కుల సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు.
వేస్టేజీ వస్తువులు కొనొద్దు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని స్క్రాప్ దుకాణదారులు ఎట్టి పరిస్థితులలోనూ స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్ల నిర్వాహకుల నుంచి వేస్టేజీ వస్తువులు (వాడిన పాత ప్లాస్టిక్, ఇను ము, పుస్తకాలు, అట్టలు) కొనవద్దని మున్సిపల్ అధికారులు సూచించారు. సుమారు 15 మందికి శనివారం నోటీసులు అందజేశారు. ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి వాటిని కొనుగోలు చేసినట్లు తమదృష్టికి వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యక్తికి గాయాలు
దేవరకద్ర: మండల కేంద్రంలోని అమ్మాపూర్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. మండలంలోని గోపన్‌పల్లికి చెందిన వేణుసాగర్ బైక్‌పై దేవరకద్రకు వస్తుండగా అమ్మాపూర్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈఘటనలో గాయపడ్డ వేణుసాగర్‌ను ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ..
రాజాపూర్: మండలంలోని మోత్కులకుంటతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. హెచ్‌ఎం శ్రీనివాస్‌రావ్, ఉదయ్‌కుమార్, భాస్కర్, తిమ్మారెడ్డి, రేణుక, సతీష్‌రాథోడ్ పాల్గొన్నారు.
చిన్నచింతకుంట: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌గా హర్షిక,డీఈఓగా శ్రావణ్‌తేజ, మండల విద్యాధికారిగా మాదియ తబాసుం, ప్రధానోపాధ్యాయులుగా ఖమేష్ తబసుంలతో పాటు 30 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.
రుణాలను సకాలంలో చెల్లించండి
మహమ్మదాబాద్: డ్వాక్రా సంఘాల్లో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని బీఎల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. మండలంలోని కంచన్‌పల్లి డ్వాక్రా సంఘాల్లో రుణాలు తీసుకుని చెల్లించని వ్యక్తిపై గ్రామస్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు శనివారం పీఎం నర్సింహస్వామి, పీడీ వెంకట్ ఆధ్వర్యంలో మహిళాసంఘాలతో కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మహిళలను మోసం చేసే విధంగా రుణం తీసుకొని చెల్లించక ఇబ్బందులు పెట్టడంతో ఎలాౖగైనా తీసుకున్న రుణాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. శ్రీనిధి తీసుకున్న మహిళలు కూడా క్రమం తప్పకుండా చెల్లించాలని, అధికారులు మళ్లీ రుణాలు ఇస్తారని తెలిపారు. ఏపీడీ జోజన్న, ఏపీఎంలు బాలకృష్ణ, సునిత సీసీలు తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment