గడువులోగా లక్ష్యం చేరుకోవాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్థిక సంవత్సరం (2024–25) ముగియడానికి 17 రోజులే మిగిలి ఉందని.. ఆలోపు పట్టణాలలో ఆస్తిపన్ను, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి లక్ష్యం చేరుకోవాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నగరంలో ఇంకా రూ.నాలుగు కోట్ల ఆస్తి పన్ను వసూలైతేనే 16వ ఆర్థిక సంఘం గ్రాంట్‌కు అర్హత దక్కుతుందన్నారు. అలాగే జడ్చర్ల పట్టణంలో రూ.80 లక్షలు, భూత్పూర్‌లో రూ.60 లక్షల మేర ఆస్తిపన్ను ఎలాగైనా రాబట్టాలని సూచించారు. ఇక ఒక్కో ఆర్‌పీ కనీసం వంద మంది ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో కల్పిస్తున్న 25 శాతం రాయితీపై అవగాహన కల్పించాలన్నారు. వీలైనంత ఎక్కువ మంది ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డితో పాటు జడ్చర్ల, భూత్పూర్ కమిషనర్లు లక్ష్మారెడ్డి, నూరుల్ అహ్మద్, ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా, మెప్మా ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌శివేంద్రప్రతాప్
మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment